iQOO 12: ఐకూ నుంచి మరో కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, ధరపై ఓ లుక్కేయండి..

|

Nov 23, 2023 | 1:21 PM

టెక్‌ మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఐకూ 12 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఈ ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్నారు. ఈ ఫోన్‌ను మొదట చైనా మార్కెట్లో లాంచ్‌ చేయనుండగా, అనంతరం భారత్‌లోకి తీసుకొస్తారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి.? వివరాలు మీకోసం..

1 / 5
చైనాకు చెందిన ఐకూ 12 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. నవంబర్‌ నెలలో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ నెట్టింట వీటికి సంబంధించి పలు లీక్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

2 / 5
నెట్టింట వైరల్‌ అవుతోన్న సమాచారం మేరకు ఈ స్మార్ట్ ఫోన్‌ వైట్​ అండ్​ గ్లాస్​ ఎడిషన్స్​లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్‌లో 2కే రిసొల్యూషన్​, 144 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింటర్‌ ఇవ్వనున్నారు.

3 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఎయిన్‌ కెమెరాతో పాటు రెండు 50 ఎంపీ అల్ట్రా వైడ్‌ లెన్స్‌తో కూడిన ట్రిపుల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. ఫ్రంట్‌ కెమెరాకు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

4 / 5
ఐకూ 12 స్మార్ట్ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ఎస్‌ఓసీ చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాసెసర్‌తో వస్తున్న తొలి ఫోన్‌ ఇదేనని సమాచారం.

5 / 5
ఇక ఈ ఫోన్‌లో 4800 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 120 వాట్స్‌ ఫాస్ట్ వైర్డ్‌ ఛార్జింగ్‌కు ఈ బ్యాటరీ సపోర్ట్ చేయనుంది. బడ్జెట్‌ ఫ్రెండ్లీ ధరలోనే ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం.