Interest free Loans: ఆ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్‌.. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణ పరిమితి పెంపు

|

Jul 07, 2023 | 6:17 PM

ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం పలు పథకాలను ప్రవేశపెడుతూ అండగా నిలుస్తున్నాయి. వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో కీలక ప్రకటనలు చేస్తోంది..

1 / 5
కర్ణాటక ముఖ్యమంత్రి సీఎం సిద్ధరామయ్య తన 14వ బడ్జెట్‌లో రైతులకు శుభవార్త అందించారు. రైతులకు వడ్డీలేని రుణాలను 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచారు.

2 / 5
అలాగే మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు. మెట్ట ప్రాంతాల రైతులకు పిక్ వ్యాన్ల కొనుగోలుకు తక్కువ వడ్డీకి రూ .7 లక్షల వరకు రుణం ఇస్తామని బడ్జెట్ లో ప్రకటించారు.

3 / 5
సిద్ధరామయ్య తన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి మేలు చేసే అనేక అభివృద్ధి పనులను ప్రకటించారు. రూ.75 కోట్లతో శిడ్లఘాట్‌లో పట్టు మార్కెట్‌ ఏర్పాటు, కొబ్బరి , వేరుశనగ, ద్రాక్ష, దానిమ్మ పంటల ప్రాసెసింగ్ కోసం 10 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్, చిక్కమగళూరులో టూరిజం, కాఫీ పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని బడ్జెట్‌లో పేర్కొన్నారు.

4 / 5
రాష్ట్ర ప్రభుత్వం అనుగ్రహ యోజన కింద గొర్రెల పెంపకందారులకు సౌకర్యాలు కల్పించింది. ఈ పథకంలో గొర్రెలు, మేకలు చనిపోతే యజమానులకు రూ.5 వేల వరకు పరిహారం అందజేస్తారు .

5 / 5
ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోని 19 చెరువులను నింపేందుకు రూ .770 కోట్లు కేటాయించారు. పశువులకు సంబంధించిన స్రవంతి ప్రాజెక్టు కోసం మొత్తం రూ.22,252 కోట్లు కేటాయించారు.