పిల్లల చర్మం చాలా సున్నితంగా, లేతగా ఉంటుంది. ఎలాంటి పౌడర్స్, ఆయిల్స్ రాసినా పడక పోతే వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది. ఏవి పడితే అవి పిల్లలకు రాయకూడదు. దీని వల్ల స్కిన్ రాసెష్, దురద, మంట వంటి సమస్యలు వస్తాయి. బయట కొనే బేబీ ఆయిల్స్‌లో అనేక రసాయనాలు కలుపుతారు.
కానీ బేబీకి వాడే ఆయిల్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పూర్వం ఇంట్లో తయారు చేసిన ఆయిల్సే పిల్లలకు రాసేవారు. ఇంట్లోని నూనెలే కాబట్టి వీటిల్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు. పిల్లలకు కూడా బావుంటారు. మరి ఇంట్లో బేబీ ఆయిల్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక అరకప్పు స్వచ్ఛమైన కొబ్బరి నూనె తీసుకోవాలి. ఇందులో ఓ నాలుగు స్పూన్ల ఆముదం వేసి కలపండి. ఆ తర్వాత ఓ పావు కప్పు ఆలివ్ ఆయిల్, రెండు చుక్కల ఎసెన్షియల్ లావెండర్ ఆయిల్ వేసి అన్నీ మిక్స్ చేయండి. ఈ నూనె పిల్లల చర్మానికి, జుట్టుకు కూడా ఉపయోగించవచ్చు.
అలాగే గానుగ పట్టించిన పప్పు నూనె, నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె వీటిని కూడా సమానంగా తీసుకుని కలిపి రాయవచ్చు. వీటిని వాడటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. చర్మ రంగు మెరుగు పడుతుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఇలా ఇంట్లోనే తయారు చేయించిన నూనెలు వాడటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి సమస్యలు రావు. పిల్లల శరీర నొప్పులు తీరతాయి. కండరాలు బలంగా తయారవుతాయి.