
ఆరోగ్యంగా ఉండటానికి అతి ముఖ్యమైన ఆధారం ఒంట్లోని రోగనిరోధక వ్యవస్థ. రోగనిరోధక శక్తి ఎంత బలంగా ఉంటే ఆరోగ్య సమస్యలు అంత దూరంగా ఉంటాయి.

బెటర్ హెల్త్ ప్రకారం ఇందులో తెల్ల రక్త కణాలు, యాంటీబాడీలు, శోషరస వ్యవస్థ, ప్లీహము, ఎముక మజ్జ, థైమస్ గ్రంథి వంటి ఎన్నో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే మీ రోగనిరోధక శక్తిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

మీ రోగనిరోధక శక్తి బలహీనపడితే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో మనం తీసుకునే ఆహారం చాలా కీలకం.

అందుకే మీ ఆహారంలో వీలైనంత ఎక్కువ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను చేర్చుకోవడం మంచిది. మీ రోగనిరోధక శక్తిని త్వరగా పెంచేవి పండ్లు మాత్రమే. అందుకే అన్ని సీజన్లలో లభించే పండ్లు ఆయా కాలాలకు అనుగుణంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

రోగనిరోధక శక్తిని పెంచడానికి పండ్లు మాత్రమే కాదు. గ్రీన్ టీ కూడా ముఖ్యం. టీ లేదా కాఫీ తాగడానికి బదులుగా మీ రోజువారీ జీవనశైలిలో గ్రీన్ టీని చేర్చుకుంటే రోగాలు మీదరికి రానేరావండి.