ఏటా IIFA అవార్డుల ప్రదానోత్సవం వివిధ దేశాల వేదికగా ఘనంగా జరుగుతుంది. ఈ ఏడాది IIFA ఉత్సవాలు జూన్ 4న అబుదాబిలో జరిగాయి.
દ సాధారణంగా అవార్డు పేరు వినగానే సెలబ్రిటీలు రెడ్ కార్పెట్‌పైనే ఎక్కువగా నడుస్తుంటారు. అయితే ఐఫాలో మాత్రం సినీతారలు గ్రీన్ కార్పెట్ మీద నడుస్తారు కానీ రెడ్ మీద కాదు. దీనికి ఓ ప్రత్యేక కారణముంది.
కార్పెట్ రంగును ఎరుపు నుంచి గ్రీన్‌గా మార్చాలని 15 ఏళ్ల క్రితం ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, గ్రీన్ ప్లానెట్ సందేశాన్ని తెలియజేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. 2007లో UKలోని షెఫీల్డ్‌లో IIFA జరిగినప్పుడు మొదటిసారిగా గ్రీన్ కార్పెట్‌ను ఏర్పాటుచేశారు
సినిమా తారలతో పర్యావరణ సందేశాన్ని అందిస్తే ఎక్కువమందికి చేరుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు IIFA నిర్వాహకులు తెలిపారు.
IIFA అవార్డులను 22 సంవత్సరాల క్రితం విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రారంభించింది. మొదటి IIFA అవార్డులు 2000లో లండన్‌లో జరిగాయి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ అవార్డు ప్రదర్శన ప్రపంచంలోని వివిధ దేశాలలో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అబుదాబిలో జరిపారు.
IIFA అవార్డులకు ఇప్పటివరకు దుబాయ్, బ్యాంకాక్, న్యూయార్క్, కొలంబో, ఆమ్‌స్టర్‌డామ్, మాడ్రిడ్, ఫ్లోరిడా, కౌలాలంపూర్, మకావు నగరాలు ఆతిథ్యమిచ్చాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఈ ఏడాది IIFA అవార్డులను హోస్ట్ చేస్తున్నారు.