
మధుమేహంతో బాధపడేవారు తరచుగా మూత్ర విసర్జన సమస్యలతో బాధపడుతుంటారు. తరచుగా మూత్రవిసర్జన చేయడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఈ సమస్యను నివారించాలంటే కీరదోస క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి పొట్ట సమస్యలుంటే కొన్ని రోజుల పాటు కీర దోస తినకపోవడమే మంచిది. ఇక దోసకాయను రెగ్యులర్ గా తినే అలవాటు ఉంటే.. మధ్యాహ్నం తినడం మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. దోసకాయ శరీరంలోని విషపూరితమైన అంశాలను తొలగిస్తుంది. ఇందులో 95 శాతం నీరు ఉంటుంది. దీని సహాయంతో శరీరం నుండి టాక్సిన్స్ బయటకు వస్తాయి.

దోసకాయలో ఉండే ఫైబర్ ఎలిమెంట్స్ జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడతాయి. దీన్ని తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. రాత్రిపూట దోసకాయ తినవద్దనడానికి ప్రధాన కారణం ఇందులోని పీచుపదార్థం. మధ్యాహ్నం-సాయంత్రం తర్వాత మన శారీరక శ్రమ తగ్గుతుంది.

అందువల్ల రాత్రిళ్లు కీరదోస తింటే ఇందులోని పీచు పదార్థం సులభంగా జీర్ణం కాదు. ఫలితంగా, కడుపు ఉబ్బి, అపానవాయువు ఏర్పడుతుంది. నిద్ర కూడా పట్టదు. దోసకాయ తినడం వల్ల.. పగటి పూట కానీ.. ఎప్పుడైనా చాలాసేపు నీరు తాగడం మరచిపోతే శరీరంలోని నీటి కొరతను తీరుస్తుంది.

ఇది హీట్ బర్న్, స్కిన్ అలర్జీలు, సన్ బర్న్ నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ సమస్యలు ఉన్నప్పుడు దోసకాయను తినడం చాలా మంచిది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది: దోసకాయ తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోయి శరీర వ్యవస్థ సాఫీగా సాగుతుంది. దోసకాయ రసం తాగడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.