
చాలా మందికి పాదాల్లో మంటలు అనేవి వస్తూ ఉంటాయి. పాదాల్లో మంటలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నిలబడినా, జర్నీ చేసినా, శరీరంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా, పాదాల్లోని ఎముకల నొప్పులున్నా కూడా.. పాదాల్లో మంటలు అనేవి వస్తూ ఉంటాయి.

ఒక్కోసారి తిమ్మిరులు కూడా వస్తూ ఉంటాయి. చాలా మందికి ఎక్కువగా రాత్రి పూటే ఈ సమస్య వస్తుంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీన్ని ఎలా తగ్గించు కోవాలో చూద్దాం. కొన్ని అనారోగ్య సమస్యలు రావడానికి సూచనగా పాదాల్లో మంటలు వస్తాయి.

పాదాల్లో మంటలు రావడానికి మధుమేహం కూడా కారణం కావచ్చు. కంట్రోల్ కాకపోతే.. రక్తనాళాలు దెబ్బతిని ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. ముఖ్యమైన పోషకాలు తక్కువైన కారణంగా కూడా పాదాల్లో నొప్పులు రావచ్చు. విటమిన్లు బి12, బి6, బి9 తక్కువైతే ఈ నొప్పులు వస్తాయి.

శరీరంలో ఎర్ర రక్త కణాలు, విటమిన్ బి లోపం వల్ల కూడా పాదాల్లో మంటలు కనిపిస్తాయి. థైరాయిడ్ సమస్య, హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా నరాలు దెబ్బతినొచ్చు. వీటి వల్ల కూడా పాదాల్లో నొప్పులు వస్తాయి.

శరీరంలో కిడ్నీలు సరిగా పనిచేయకపోతే రక్తంలో టాక్సిన్స్ అనేవి పేరుకుపోతాయి. దీంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పెరిఫెరల్ న్యూరోపతి కారణంగా కూడా పాదాల్లో మంటలు, నొప్పులు, చికాకులను కలిగిస్తాయి. కాబట్టి వైద్యుల్ని సంప్రదించడం మేలు.