హైదరాబాద్‌లో మళ్లీ సందడి చేస్తున్న పిచ్చుకలు.. 20 వేల పక్షులను తిరిగి తీసుకొచ్చిన అద్భుత ప్రయత్నం

Edited By:

Updated on: Jul 04, 2026 | 2:03 PM

ఒకప్పుడు ప్రతి ఇంటి ముంగిట, ప్రతి చెట్టు కొమ్మపై కిచకిచలాడే పిచ్చుకలు. ఇప్పుడు కనిపిస్తేనే ఆశ్చర్యపడే పరిస్థితి. వేగంగా పెరిగిన నగరీకరణ, కాంక్రీట్ అడవులు, గూళ్లు కట్టుకునే ప్రదేశాల కొరత, ఆహారం తగ్గిపోవడం, కాలుష్యం.. ఇలా ఎన్నో కారణాలతో హైదరాబాద్‌లో పిచ్చుకల సంఖ్య ఆందోళనకరంగా తగ్గిపోయింది.

1 / 5

2 / 5
అయితే ఇప్పుడు ఆ చిట్టి పొట్టి ముద్దు పక్షులు మళ్లీ నగరంలో సందడి చేస్తున్నాయి. దీనికి కారణం యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ (AWCS) చేపట్టిన 'బ్రింగ్ బ్యాక్ స్పారో' ఉద్యమం. 2016లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌లోని అమీన్‌పూర్, గచ్చిబౌలి, దిల్‌సుఖ్‌నగర్, ఆల్వాల్ తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు 1,600కుపైగా ప్రత్యేక గూళ్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు, గత పదేళ్లుగా ప్రతి సంవత్సరం వెయ్యికి పైగా గూళ్లను ప్రజలకు ఉచితంగా అందిస్తూ, ఇప్పటికే ఏర్పాటు చేసిన గూళ్లను కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

3 / 5
ఈ కృషి ఫలితంగా హైదరాబాద్‌కు దాదాపు 20 వేల పిచ్చుకలు తిరిగి వచ్చాయని సంస్థ వ్యవస్థాపకుడు ప్రదీప్ నాయర్ తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన గూళ్లలో దాదాపు 90 శాతం గూళ్లను పిచ్చుకలు ఆక్రమించుకోవడం ఈ కార్యక్రమం విజయానికి నిదర్శనమని చెప్పారు. సాధారణంగా ఒక పిచ్చుక ఏడాదిలో నాలుగు నుంచి ఆరు సార్లు సంతానోత్పత్తి చేస్తుంది. ఒక్కోసారి రెండు నుంచి నాలుగు పిల్లలు పుడతాయి. భద్రత కలిగిన గూళ్లు అందుబాటులో ఉండటంతో పిల్లల మనుగడ శాతం కూడా బాగా పెరిగిందని ఆయన వివరించారు.

4 / 5
ఈ కార్యక్రమంలో అపార్ట్‌మెంట్లు, కాలనీలు, కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములుగా చేస్తూ, గూళ్ల ఏర్పాటుతో పాటు పక్షులకు నీటి పాత్రలు ఉంచడం, ఆహారం అందించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే బాల్కనీలు, డాబాలు, ఖాళీ ప్రదేశాలను పిచ్చుకలకు అనువుగా ఎలా మార్చాలో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పిచ్చుకలు కేవలం అందమైన పక్షులు మాత్రమే కాదు. ప్రకృతిలో సహజ కీటక నియంత్రణలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. వాటి సంఖ్య పెరగడం వల్ల నగర జీవవైవిధ్యం కూడా సమతుల్యం అవుతుందని ప్రదీప్ నాయర్ తెలిపారు.

5 / 5
ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు, స్థానిక ప్రజలు మరింత సహకరిస్తే ఈ ఉద్యమాన్ని హైదరాబాద్‌కే పరిమితం కాకుండా తెలంగాణలోని ఇతర పట్టణాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక చిన్న గూడు.. ఒక నీటి పాత్ర.. కొద్దిగా ఆహారం. ఇవే మళ్లీ మన నగరంలో పిచ్చుకల కిలకిలారావాలు వినిపించడానికి కారణమవుతున్నాయి.

Follow Us