Hyderabad New Mega Bus Terminal: భాగ్యనగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఐటీ రంగం, పారిశ్రామికాభివృద్ధి వల్ల జనాభా పెరగడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం నగరంలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS), జూబ్లీ బస్ స్టేషన్ (JBS)లపై ఒత్తిడి విపరీతంగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, శివారు ప్రాంతాల్లో శాటిలైట్ టెర్మినల్స్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే గాజులరామారంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఇటీవల ఆర్టీసీకి కేటాయించారు.

విస్తీర్ణం: ఈ 100 ఎకరాలను కేవలం ఒక బస్టాండ్‌లా కాకుండా, ఒక సమగ్ర రవాణా వ్యవస్థగా (Integrated Transport Hub) తీర్చిదిద్దనున్నారు. ఆర్టీసీ సిద్ధం చేసిన ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం భూమి వినియోగం ఇలా ఉండబోతోంది. అంతరాష్ట్ర బస్ టెర్మినల్ (30 ఎకరాలు): ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే సుదూర ప్రాంత బస్సుల కోసం ప్రత్యేకంగా 30 ఎకరాలను కేటాయించారు. దీనివల్ల భారీ బస్సులు నగరం లోపలికి రాకుండా శివార్ల నుంచే తిరుగుతాయి. ఫలితంగా సిటీలో ట్రాఫిక్ తగ్గుతుంది.

సిటీ బస్ టెర్మినల్ (20 ఎకరాలు): అంతరాష్ట్ర బస్సుల్లో వచ్చే ప్రయాణికులు నగరం లోపలికి వెళ్లడానికి వీలుగా ఇక్కడి నుంచే సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆధునిక వెయిటింగ్ హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఫుడ్ కోర్టులు నిర్మిస్తారు. ఎలక్ట్రిక్ బస్ డిపో (10 ఎకరాలు): మారుతున్న కాలానికి అనుగుణంగా పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థ కోసం ప్రత్యేకంగా ఈవీ (EV) బస్ డిపోను ఏర్పాటు చేస్తున్నారు. అలాగేవందలాది ఎలక్ట్రిక్ బస్సులు ఒకేసారి చార్జింగ్ చేసుకునేలా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన చార్జింగ్ పాయింట్లను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు.

ట్రాఫిక్ చిక్కులకు చెక్: ప్రస్తుతం అంతరాష్ట్ర బస్సులు నగరం నడిబొడ్డులోకి రావడం వల్ల బాలానగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. గాజులరామారం టెర్మినల్ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర వైపు వెళ్లే బస్సులన్నీ ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తాయి. దీనివల్ల నగర రోడ్లపై ఒత్తిడి తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ మెగా టెర్మినల్ కేవలం ప్రయాణికులకే కాకుండా, స్థానిక ప్రాంత అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ హబ్, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రవాణా కేంద్రాలలో ఒకటిగా నిలవనుంది. చార్జింగ్ స్టేషన్లు, డిపోలు, వాణిజ్య సముదాయాలతో కూడిన ఈ ప్రాజెక్టు పూర్తయితే టీజీఎస్‌ఆర్టీసీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ప్రభుత్వం, ఆర్టీసీ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను పూర్తి చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి.