
అందంగా కనిపించాలని అందికి ఉంటుంది. కానీ వాతావరణంలో మార్పులు మన చర్మాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. వర్షాకాలంలో చల్లని వాతావరణ కారణంగా గాలిలోని తేమ వల్ల చర్మం మొత్తం జిడ్డుగా మారుతుంది. అప్పుడు గాలిలోని దుమ్ము, దూలి మొత్తం ముఖంపై పేరుకుపోయి చర్మంపై మొటిమలు, ఇన్‌ఫెక్షన్‌లు ఏర్పడే అవకాశం ఉంటుంది.

వీటిని దూరం చేసుకునేందుకు చాలా మంది తరచుగా ఖరీదైన, రసాయనాలతో నిండిన సీరమ్‌లు, టోనర్‌లు ఫేషియల్స్ వాడుతూ.. వాటి కోసం వేల రూపాయలు ఖర్చు చేంటారు, కానీ మీ వంటగదిలో లేదా బాల్కనీలో కుండీలో పెరిగే నిమ్మగడ్డితో ఈజీగా పోగొట్టొచ్చని చాలా మందికి తెలియదు. ఈ నిమ్మగడ్డిని కేవలం టీలో మాత్రమే వాడుతారు అని చాలా మంది అనుకుంటారు. కానీ దీన్ని ఆయుర్వేదంలో చర్మ సౌందర్యానికి ఔషదంగా వాడుతారు.

ఈ మొక్కలో విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ బాక్టీరియల్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది మీ ముఖంపై ఉన్న వృద్ధాప్య ముడతలు, మొటిమలు, జిడ్డును తొలగిస్తుంది. తెరిచి ఉన్న రంధ్రాలను కుదించడానికి సహాయపడుతుంది, అలాగే చర్మానికి ఒక అద్భుతమైన సహజ టోనర్‌గా పనిచేస్తుంది. మీ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది.

నిమ్మగడ్డిని మనం 3 రకాలుగా మనం వాడుకోవచ్చు. ఒకటి టోనర్‌గా ఇందుకోసం మీరు కొన్ని నిమ్మగడ్డి ఆకులను తీసుకొని వాటిని నీటిలో వేసి మరిగించండి. చల్లారిన తర్వాత, వడకట్టిన నీటిని ఒక స్ప్రే బాటిల్‌లో స్టోర్ చేసుకోని ప్రతిరోజూ టోనర్‌గా ముఖంపై స్ప్రే చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం ద్వారా ముఖం సహజంగా మెరుస్తుంది.

దీన్ని మరోవిదంగా ఎలా వాడాలి అంటే.. కొద్దిగా శనగపిండి లేదా ముల్తానీ మట్టిని నిమ్మగడ్డి నీటితో కలిపి పేస్ట్ లాగా చేసి ముఖానికి పట్టించండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా చేయడం ద్వారా కూడా మీరు చర్మ నిగారింపును పెంచుకోవచ్చు. అలాగే నిమ్మగడ్డి ఆకులను వేడి నీటిలో ఆవిరి పట్టించండం ద్వారా చర్మ రంధ్రాలను శుభ్రపరిచి, బ్లాక్‌హెడ్స్‌ను తొలగిస్తుంది. ఇలా నిమ్మగడ్డిని సరైన పద్దతిలో వాడితే సహజంగానే అందాన్ని పెంచుకోవచ్చు.