Raw Coconut Preserve Tips: ఈ సింపుల్ టిప్స్‌తో పచ్చి కొబ్బరిని నెల రోజులు నిల్వ చేయవచ్చు..

|

Sep 02, 2024 | 1:49 PM

పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ప్రతి రోజూ ఓ చిన్న ముక్క పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. పచ్చి కొబ్బరి తింటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. మలబద్ధకం, అజీర్తి సమస్యలు కంట్రోల్‌లో ఉంటాయి. గుండె ఆరోగ్యానికి..

1 / 5
పచ్చి కొబ్బరిలో కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అందువల్ల దీని రెగ్యులర్ వినియోగం బోలు ఎముకల వ్యాధితో సహా ఎముక సంబంధిత రుగ్మతలను నివారిస్తుంది.

2 / 5
పచ్చి కొబ్బరి తింటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. మలబద్ధకం, అజీర్తి సమస్యలు కంట్రోల్‌లో ఉంటాయి. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బరువు కూడా తగ్గొచ్చు. చర్మ, జుట్టు ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఒక్కటేంటి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి.

3 / 5
అయితే పచ్చి కొబ్బరి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండదు. కొన్ని రెండు, మూడు రోజులకే కుళ్లి పోతుంది. అలాంటి పచ్చి కొబ్బరి నిల్వ ఉండాలంటే ఈ చిట్కాలు ఎంతో చక్కగా సహాయ పడతాయి. పచ్చి కొబ్బరి బయట, ఫ్రిజ్‌లో కూడా నిల్వ చేసుకోవచ్చు.

4 / 5
ముందుగా కొబ్బరిని కొట్టి.. చిప్పలను వేరు చేయండి. ఆ తర్వాత ముక్కలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి.. మిక్సీలో వేసి పౌడర్‌లా చేసుకోండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుమును.. ఒక బాక్సులో వేసి చాకుతో గాట్లు పెట్టండి. ఈ బాక్స్ ఫ్రిజ్‌లో పెట్టండి. అవసరం అయినప్పుడు ఉపయోగించుకోవాలి.

5 / 5
ఈ చిట్కా కూడా చక్కగా ఉపయోగ పడుతుంది. ముందుగా కొబ్బరిని కడిగి ముక్కలుగా కట్ చేసి ఫ్యాన్ గాలిలో వేసి ముక్కలు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని స్టవ్ మీద ఓ కడాయిలో వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ పొడిని ఫ్రిజ్‌లో లేదా బయట కూడా నిల్వ చేసుకోవచ్చు.