
ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ సరిపడా నీళ్లు తాగాలి. ముఖ్యంగా రోజు మొత్తంలో కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. ఉష్ణోగ్రతలు, వాతావరణాలపై నీటి మోతాదు ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.

ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధుల నుంచి దూరంగా ఉండటానికి శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం అతి ముఖ్యమైన విషయం. ముఖ్యంగా వేసవిలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం.

వేసవిలో ఎండ వేడిమి తీవ్రంగా ఉంది. అటువంటి పరిస్థితిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో చెమ, మూత్రం ద్వారా మలినాలు బయటకు పోతాయి.శరీరంలో ప్రతి కణం, కణజాలం, అవయవం సరిగ్గా పనిచేస్తాయి. శరీర ఉష్ణోగ్రతలు కూడా నియంత్రణలో ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అందుకే వేసవిలో పుష్కలంగా నీళ్లు తాగాలి. నీళ్లతోపాటు నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగడం మచిది. వేసవిలో తరచుగా తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.. అలాంటి పరిస్థితిలో వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలి.

అలాగే వేసవిలో అనారోగ్యంగా అనిపిస్తే వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగండి. ఇది సగానికి పైగా సమస్యలను పరిష్కరిస్తుంది. మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచి ఆరోగ్యం కాపాడుతుంది. ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగాలి. అలసట, తలనొప్పి, ఒత్తిడి ఉన్నప్పుడు టీ, కాఫీల కంటే మంచినీరు తాగడం మేలు.