Winter: వింటర్ స్పెషల్..అద్భుతమైన కాఫీ ఇంట్లో ఇలా రెడీ చేయండి!

Updated on: Nov 25, 2025 | 8:48 AM

చలికాలం వచ్చిందంటే చాలు చాలా మంది కాఫీ తాగడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. ఇది శరీరానికి వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అందుకే ఎక్కువ మంది కాఫీ తాగడానికే ఆసక్తి చూపుతారు. కాగా, ఇప్పుడు మనం చలికాలంలో కాఫీ తయారీ విధానం చూద్దాం.

1 / 5
రోజుకు కనీసం రెండుసార్లు టీ లేదా కాఫీ తాగడం మంచిది. అంతకంటే ఎక్కువ తాగడం డేంజర్‌. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు టీ, కాఫీ తాగడం పూర్తిగా మానేయాలి.

2 / 5
చలికాలంలో ఎక్కువ సార్లు కాఫీ తాగాలి అనుకుంటారు. అయితే మనం ప్రతి సారీ కేఫ్ కు వెళ్లలేం కదా.. కాగా, ఇప్పుడు మనం కేఫ్ లో ఉండే అంత టేస్టీగా ఇంటిలోనే కాఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

3 / 5
కాఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు పాలు, ఒక కప్పు కాఫీ పౌడర్, ఒక టీస్పూన్ చక్కెర, ఒక టీస్పూన్ కోకో పౌడర్, చిటికెడు దాల్చిన చెక్క, ఒక టేబుల్ స్పూన్  విప్డ్ క్రీమ్.

4 / 5
తయారు చేయు విధానం :ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. అందులో కాఫీ, పొడి, చక్కెర , వన్ టీస్పూన్ నీరు పోసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసి, స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టాలి. అందులో పాలు పోసి మరిగించాలి. పాలు కాస్త మరిగిన తర్వాత అందులో కోకో పౌడర్, దాల్చిన చెక్క వేసి కలుపుకోవాలి.

5 / 5
దీని తర్వాత మనం ముందుగా కలుపుకున్న కాఫీ, చక్కెర, మిశ్రమాన్ని పోసి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో మరికొన్ని వేడి పాలు పోసుకోవాలి. పైన విప్డ్ క్రీమ్ రాయండి అంతే, చలికాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే, కేఫ్ తరహాలోని స్పెషల్ కాఫీ రెడీ.

Follow Us