
తమిళనాడులో చాలా మంది ఇష్టపడే స్నాక్స్‌లలో మురుకులు ముందుంటాయి. ఇవి మంచి రచిని ఇవ్వడమే కాకుండా, మంచి ఆకారాన్ని కలిగి ఉంటాయి. బియ్యం పిండి,మినపప్పు పిండి , జీలకర్ర లేదా నువ్వులు, సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో ఈ మురుకులను తయారు చేస్తారు. ఇక మంచి రుచి, క్రిస్పీగా క్రంచ్ రుచి కోసం నెయ్యి కలిపి చేస్తుంటారు. కాగా ఈ టేస్టీ టేస్టీ మురుకులు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు : 2 కప్పుల బియ్యం, మినప పప్పు ఒక కప్పు, వన్ స్పూన్ వెన్నె లేదా నెయ్యి, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ నవ్వులు లేదా జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పు కారం, డీప్ ఫ్రై కోసం నూనె.

తయారు చేయాల్సిన విధానం : ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండి, మినపప్పు పిండి, తీసుకోవాలి. అందులో నువ్వులు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు, కారం పొడి, నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని కొన్ని వాటర్ కలుపుతూ కాస్త మెత్తగా, పిండి అంటుకోకుండా కలుపుకోవాలి. అంతే మనం మురుకుల కోసం పిండి రెడీ చేసుకున్నాం.

తర్వాత స్టవ్ ఆన్ చేసి, కాస్త లోతుగా, పెద్దగా ఉండే, పాన్ తీసుకొని ,స్టవ్ పై పెట్టాలి. ఆ తర్వాత అందులో డీ ఫ్రైకి సరిపడ నూనె వేసి, మీడియం మంట మీద నూనెను వేడి చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పిండిని, మురుకులు చేసే పాత్రలో వేసి, పాన్‌లో ఒత్తుకోవాలి. అచ్చం మురుకుల ఆకారంలో అవి వస్తాయి. తర్వాత అవి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ మురుకులు రెడీ.

ఇక వీటిని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసుకొని ప్రతి రోజూ తినవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారికి వరకు అన్ని వయసుల వారు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అంతే కాకుండా, ఉదయం టీలో తిన్నాకూడాఅద్భుతంగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంటిలో ఆలస్యం చేయకుండాప్రిపేర్ చేసుకోండి.