ఉల్లిపాయతో ఇలా కాని పచ్చడి పెట్టారో.. ఇక దుమ్ముదుమారమే.. ఎగబడి లాగించేస్తారు..

Updated on: Mar 21, 2026 | 3:45 PM

Ullipaya pachadi in telugu: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయ పచ్చడిని చాలా మంది తింటారు. అయితే, టిఫిన్స్ కంటే అన్నంలోకే రుచిగా ఉంటుంది. ఇది రుచికి అద్భుతంగా ఉంటుంది. దీనిని చెయ్యడానికి ఎంతో టైం కూడా పట్టదు. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయ పచ్చడి చాలా ఫేమస్. దీనిని ఎక్కువగా అన్నం, టిఫిన్స్  లో ఎక్కువగా తింటారు. ఇది రుచికి అద్భుతంగా ఉంటుంది. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. 5 నుంచి 10 నిమిషాల్లో లోపే అయిపోతోంది.

2 / 5
కావాల్సిన పదార్దాలు : 4 ఉల్లిపాయలు, 10 ఎండుమిర్చి, నిమ్మకాయంత చింతపండు,  రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, పోపు గింజలు, కరివేపాకు, నూనెను తీసుకోవాలి.

3 / 5
ఉల్లిపాయ పచ్చడి ఎలా తయారు చేయాలంటే ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి, అది వేడయ్యాక దానిలో ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు , కొద్దిగా చింతపండు, 7 వెల్లుల్లి పాయలు వేసి  మెత్తగా అయ్యే వరకు బాగా వేయించాలి.

4 / 5
 వేయించిన ఈ మిశ్రమాన్ని తీసుకుని ఫ్యాన్ కింద చల్లార్చిన తర్వాత కొద్దిగా ఉప్పు  మిక్సీలో  పట్టుకోవాలి. చివర్లో దీనిని పోపు పెట్టుకోవాలి. నూనెలో అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు కూడా వేసి పచ్చడి మిశ్రమంలో కలుపుకోవాలి.

5 / 5
ఉల్లిపాయలు బాగా మగ్గితే పచ్చడి టేస్టీగా ఉంటుంది. కారం ఎక్కువగా ఉంటే బెల్లం లేదా పంచదార వేస్తే రుచి అదిరిపోతోంది . ఇలా తయారు చేస్తే పచ్చడి మూడు నుంచి రోజుల పాటు నిల్వ ఉంటుంది

Follow Us