
కావాల్సిన పదార్ధాలు : 150 గ్రాములు ఎండు చేపలు, ఒక టేబుల్ టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, మసాలా, ఒక కప్పు శనగపిండి నూనెను తీసుకోవాలి.

ముందుగా ఎండు చేపల ముక్కలను తీసుకుని వాటిని వేడి నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే వాసన మొత్తం పూర్తి పోతుంది. ఆ తర్వాత ఈ ముక్కలకు ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి వాటిని బాగా ఉడికించాలి.

ఉడికించిన ఎండు చేప ముక్కలలో నీరు మొత్తాన్ని వడ పోయండి. వీటికి కొద్దిగా కారం, అర టీ స్పూన్ మసాలా, ధనియాల పొడి, నిమ్మరసం వేసి వాటిని బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు ఒక పాత్ర తీసుకునివాటిలో ఎండు చేప ముక్కలు, శనగపిండి, కరివేపాకు , కొంచం నీళ్ళు పోసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పొయ్యి మీద పాన్ పెట్టి నూనె వేసి, పిండి పట్టించిన ఎండు చేప ముక్కలను తీసుకుని ఆయిల్లో వేసుకుని బంగారు కలర్ లోకి మారే వరకు బాగా వేయించుకోవాలి.