
కావల్సిన పదార్థాలు: 100 గ్రాములు ఎండు రొయ్యలు, 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసిన పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ మసాలా పొడి, 3 టేబుల్ స్పూన్స్ నూనె, కరివేపాకు ఆకులు , కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పును తీసుకోవాలి.

ముందుగా ఎండు రొయ్యలను తీసుకుని వేడి నీటిలో శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో ఎండు రొయ్యలు వేసి 5 నిముషాల పాటు బాగా వేయించుకోవాలి.

ఇప్పుడు మళ్ళీ రెండోసారి పాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసి, కట్ చేసిన మిర్చి, ఉల్లిపాయలు ముక్కలు వేసి బంగారురంగులోకి మారే వరకు స్టవ్ మీదే ఉంచి బాగా వేయించాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే ఉంచండి.

ఇప్పుడు టమాటాలను ఈ మిశ్రమంలో వేసి దానిలో అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి.

ఇక చివర్లో వేయించిన ముందుగా పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలు, ఒక టేబుల్ స్పూన్ కారం, మసాలా పొడి చల్లి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. గ్రేవీ కావాలనుకునే వారు నీరు పోసి 10 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర వేసి దించేయండి. అంతే వేడి వేడి టమాటా ఎండు రొయ్యలు కర్రీ రెడీ.