
కావాల్సిన పదార్ధాలు: అన్నం మూడు కప్పులు, ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక పెద్ద ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, 4 స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలో అన్నాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక, ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఉండలు లేకుండా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. పిండిలాగా చేసుకోవాలి మరి జోరుగా చేయకండి.

ఆ తర్వాత దానిలో మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు,కొత్తిమీర, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి, వేయాలి. అన్ని వేసిన తరవాత పిండిలో బాగా కలపండి.

రైస్ దోసెను పలుచగా ఉంటే తినడానికి రుచిగా ఉంటుంది. కాబట్టి, దీనిలో కొద్దిగా నీళ్లు పోసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి దానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అది వేడయ్యాక దాని మీద గరిటెతో దోసె లాగా పోయండి. దోసెను రెండు వైపులా కాల్చిన తర్వాత ప్లేట్ లోకి తీసుకుని తినేయండి. పల్లీల చట్నీతో ఈ రైస్ దోసెను తింటే మరింత టేస్టీగా ఉంటుంది.