
కావాల్సిన పదార్థాలు: 4 పాలకూర కట్టలు 3, నూనె , పోపు గింజలు, 4 ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ధనియాల పొడి ఒక టీస్పూన్, జీలకర్ర పొడి, ఉల్లిపాయలు నాలుగు, 4 వెల్లుల్లి రెబ్బలు, మూడు టేబుల్ స్పూన్స్ కారం, మీరు కూరల్లో వేసుకునేంత ఉప్పు తీసుకోవాలి.

తయారీ విధానం: పాలకూరను ముందుగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు, కారం తీసుకుని రోటిలో కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి దోరగా వేయించుకోవాలి.

ఇక ఇప్పుడు రుబ్బిన ఆనియన్ పేస్ట్ తీసుకుని దానిలో వేసుకోవాలి. మగ్గిన తర్వాత పాలకూర కూడా వేసి గరిటెతో తిప్పుకోవాలి.

అర టీ స్పూన్ పసుపు, మసాలా పొడులు వేసి బాగా వేయించుకోవాలి. దించే ముందు కొత్తిమీర చల్లి రైస్ ఫ్లేట్ లోకి వడ్డించుకుని తినేయండి. వేడి వేడి అన్నంలో మంచి టేస్టీ ఉంటుంది.