
ఈ రెసిపీని ఎక్కువగా కొర్రలతో చేసి తింటారు. దీనిలో ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో మిల్లెట్స్, కూరగాయలు వేస్తారు. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ కు ఇది పర్ఫెక్ట్. తక్కువ నీరుతో చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి.

కావాల్సిన పదార్దాలు : మిల్లెట్స్, నాలుగు బిర్యానీ ఆకు, 5 లవంగం, 4 యాలకులు, ఉల్లిపాయలు ముక్కలు , కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి , క్యారెట్, ఉప్పు, కారం, నూనెను తీసుకోవాలి.

మిల్లెట్ పులావ్ ను ఎలా తయారు చేయాలంటే? ముందుగా ఒక కప్పు మిల్లెట్స్‌ను తీసుకుని వాటిని ఒకటికి రెండు సార్లు కడిగి ఒక గంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.

ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్‌లో కొద్దిగా నూనె వేసి అది వేడయ్యాక దాచిన చెక్క, లవంగం, నాలుగు యాలకులు, మసాలాలు కూడా వేసి బాగా వేయించాలి. కొద్దీ సేపటి తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి.

ఇప్పుడు నానబెట్టిన మిల్లెట్స్ ను కుక్కర్లో వేసి రెండు గ్లాస్ ల నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి టేస్ట్ చూసి మూత పెట్టాలి మీడియం మంటపై ఉంచి 5 విజిల్స్ వచ్చే దాకా మెత్తగా ఉడికించాలి. చివర్లో కొత్తిమీర వేసి కిందకు దించేయడమే.