పల్లెటూరి స్టైల్లో వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు

Updated on: Feb 24, 2026 | 11:06 PM

వంకాయ చికెన్ కర్రీ ఎప్పుడైనా తిన్నారా ? ఇది తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్. ఈ రెండింటి కాంబోలో చేసి తింటే ఆ రుచే వేరు. టేస్ట్ వేరే లెవెల్. మరి, ఇంకెందుకు లేట్ ఈ కూరకి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

1 / 5
 కావాల్సిన పదార్థాలు : 300 గ్రాములు వంకాయ ముక్కలు , చిన్న ఉల్లిపాయ, 500 గ్రాములు చికెన్, కట్ చేసిన పచ్చిమిర్చి, రెండు టొమాటో,  ఒక టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు,  ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  గరం మసాలా పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, నూనె, సరిపడినంత ఉప్పును తీసుకోండి.

2 / 5
ముందుగా వంకాయలను తీసుకుని ఉప్పు నీళ్ళతో కడిగి వాటిని ముక్కలుగా చేసుకోవాలి. అలాగే, చికెన్ ను వేడి నీటిలో వేసి ఉప్పు, పసుపుతో బాగా కడగండి.

3 / 5
ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో నూనె  వేసి అది వేడయ్యాక వంకాయ ముక్కలు వేసి గోల్డ్ రంగులోకి  వచ్చే వరకు వేయించాలి.

4 / 5
ఇక ఇప్పుడు మళ్ళీ  పాన్ తీసుకుని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి,  టమోటా, ఉల్లిపాయ, మిర్చి వేసి బాగా  వేయించాలి. ఇక ఇప్పుడు దీనిలో వంకాయ ముక్కలు  ముక్కలు, చికెన్ వేసి 10  నిమిషాలు స్టవ్ మీదే పెట్టి బాగా ఉడికించాలి.

5 / 5
చికెన్, వంకాయలు ఉడికిన తర్వాత  ఒక టీ స్పూన్  కారం, అర టీ స్పూన్ పసుపు, ఉప్పు వేసి మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి.    చివర్లో కొత్తిమీర వేసి దించేయండి. అంతే వేడి వేడి  వంకాయ చికెన్ రెడీ.

Follow Us