వంకాయలతో చేపల వేపుడు.. ఇలా చేస్తే మెతుకు కూడా మిగలదు

Updated on: Mar 23, 2026 | 10:49 AM

చేపలు అంటే ఇష్టం ఎవరికి ఉండదు. చాలా మంది ఎంతో ఇష్టంగా చేపలు తింటారు. అయితే కొంత మందికి చేపల ఫ్రై అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ చేపలు అంటే ఇష్టం ఉండదు. అయితే శాఖాహారల కోసమే ఈ అద్భుతమైన వంటకం, చేపల ఫ్రైని తల దన్నే వంకాయ ఫై ఇంటిలోనే చాలా సింపుల్‌గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు :  వంకాయలు, ఎండు మిరియాల పొడి, వెల్లుల్లి, ఎండు మిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొబ్బరి నూనె, వంట నూనె, ధనియాల పొడి, మెంతి పొడి చిటికెడు.

2 / 5
తయారీ విధానం : వంకాయలను నిలువుగా కోసి, మధ్యలో కత్తితో గీత పెట్టాలి. తర్వాత వీటిని దాదాపు 15 నిమిషాల పాటు వేడి నీటిలో నానబెట్టాలి.

3 / 5
ఇప్పుడు వెల్లుల్లి, మిరియాల పొడి, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు పొడి, కారం పొడి, పసుపు పొడి వేసి దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా కలపాలి.

4 / 5
తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి కొబ్బరి నూనె పోసి, నూనె వేడి అయ్యే వరకు చూడాలి. తర్వాత  ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలో నాన బెట్టుకున్న  వంకాయ ముక్కలను తీసి నూనెలో వేయించుకోవాలి.

5 / 5
గ్యాస్ మంట చాలా తక్కువగా పెట్టి, మంచిగా రెండు వైపులా వేయించాలి. అప్పుడే లోపల ఉన్న వంకాయ ఉడుకుతుంది. టేస్ట్ బాగుంటుంది. బాగా కాల్చుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. అంతే వేడి వేడి టేస్టీ టేస్టీ వంకాయ ఫిష్ ఫ్రై రెడీ.

Follow Us