వారెవ్వా.. వంకాయ చికెన్ కూర.. ఇలా వండారంటే గిన్నె కూడా వదలరు..

Updated on: Feb 03, 2026 | 3:43 PM

మనం ఇప్పటి వరకు ఎన్నో కూరలు వండుకుని తిన్నాము. అయితే, వాటిలో ఇంత వరకు వంకాయ, చికెన్ కూర తిని ఉండము. ఇది విన్ వినడానికి కొత్తగా ఉన్నా కూడా చేసుకుని తింటే రుచి కరంగా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

 వంకాయతో చికెన్ కూర  చేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. అయితే, ఇక్కడ దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి  ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
కావాల్సిన పదార్ధాలు: పావు కిలో చికెన్, వంకాయలు 4, చిన్నఉల్లిపాయ, టొమాటోలు 2, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ధనినియాల పొడి, ఉప్పు సరి పడినంత, 3 టేబుల్ స్పూన్స్ నూనె, కొత్తిమీర.

3 / 5
ముందుగా స్టవ్ వెలిగించి ఆ తర్వాత పాన్‌లో నూనె వేసి అది వేడయ్యాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి, రంగు మారే వరకు 
బాగా వేయించాలి. కొద్దీ సేపటి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా తిప్పుకోవాలి.

ముందుగా స్టవ్ వెలిగించి ఆ తర్వాత పాన్‌లో నూనె వేసి అది వేడయ్యాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి, రంగు మారే వరకు బాగా వేయించాలి. కొద్దీ సేపటి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా తిప్పుకోవాలి.

4 / 5
ఇక ఇప్పుడు చికెన్ ముక్కలను తీసుకుని దానిలో అర టీ స్పూన్ పసుపు, రుచికి సరి పడినంత ఉప్పు వేసి వరకు బాగా వేయించాలి. ఆ తర్వాత వంకాయ, టమాటా             ముక్కలు వేసి మగ్గించాలి. కొద్దీ సేపటి తర్వాత కారం, ధనియాల పొడి వేసి కలిసే పోయే వరకు తిప్పాలి.

5 / 5
ఇక ఈ మిశ్రమంలో వాటర్ పోసి, చికెన్, వంకాయ అన్ని మెత్తబడే స్టవ్ మీదే ఉంచాలి. దించే ముందు మసాలా, కొత్తిమీర వేసుకోవాలి. అంతే వేడి వేడి వంకాయ చికెన్ కూర రెడీ .