విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే తమలపాకుల ఫిష్ ఫ్రై.. అబ్బో ఇంత రుచా.. ఆరోగ్యానికి కూడా బెస్ట్!

Updated on: Jun 09, 2026 | 4:24 PM

వేడి వేడి అన్నంలో ఈ తమలపాకు ఫిష్ ఫ్రై ను తింటే ఎక్కడ దొరకని రుచి వస్తుంది. ఇంకా దీనిలో నాలుగు ఉల్లిపాయ ముక్కలు, ఒక నిమ్మచెక్క, ఇంకా కొద్దిగా పుదీనా చట్నీతో దీనిని సర్వ్ చేస్తే రుచి కూడా డబుల్ అవుతుంది. చేపను తమలపాకులో చుట్టి అలా 10 నిమిషాలు ఉంచి వేయిస్తే దీనిలో ఉన్న ఫ్లేవర్ ముక్కలకు పడుతుంది.

1 / 5

తమలపాకులతో ఫిష్ ఫ్రై కు కావలసిన పదార్థాలు:  అరకిలో చేప ముక్కలు,  10 తమలపాకులు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  ఒక టేబుల్ స్పూన్ కారం , అర టేబుల్ స్పూన్ పసుపు , ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి , ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 
ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం , రుచికి సరిపడా ఉప్పు,  ఒక టేబుల్ స్పూన్  బియ్యప్పిండి, నూనెను వేయించడానికి తీసుకోవాలి.

తమలపాకులతో ఫిష్ ఫ్రై కు కావలసిన పదార్థాలు: అరకిలో చేప ముక్కలు, 10 తమలపాకులు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం , అర టేబుల్ స్పూన్ పసుపు , ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి , ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం , రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండి, నూనెను వేయించడానికి తీసుకోవాలి.

2 / 5
తమలపాకుల ఫిష్ ఫ్రై తయారీ విధానం: ముందుగా చేప ముక్కలను  కడిగి దానిలో ఉన్న నీటిని పూర్తిగా వంపేయాలి. ఇంకా ఒక ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొద్దిగా కారం,  అర టేబుల్ స్పూన్ పసుపు,  అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి దీనిలో వేసుకోవాలి.

3 / 5
తమలపాకుల ఫిష్ ఫ్రై స్టెప్ - 2 : ఇంకా దీనిలో కొద్దిగా నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు కూడా దీనిలో  వేసి ఈ  మిశ్రమాన్ని తయారు చేయాలి. ఈ మసాలాను చేప ముక్కలకు పట్టించి అలాగే 40 నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు నాలుగు తమలపాకులను తీసుకుని బాగా  బాగా కడిగి వాటిని తేమ లేకుండా తుడిచి పెట్టుకోవాలి.

4 / 5
తమలపాకుల ఫిష్ ఫ్రై స్టెప్ - 3 : ఇప్పుడు చేప ముక్కలను తీసుకుని ఒక తమలపాకులో చుట్టి, వాటిని మంచిగా ఫిక్స్ చేయాలి. అలాగే, కొద్దిగా బియ్యప్పిండి దీని మీద  చల్లితే ఫ్రై చేసే టైం లో ఇది కరకరలాడుతుంది. అలాగే, పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి మీడియం మంట పై వాటికి వేడి చేసి  మంటపై తమలపాకులో చుట్టిన చేపలను గోల్డ్ కలర్లోకి మారే వరకు  వీటిని బాగా వేయించాలి.

5 / 5
వేడి వేడి అన్నంలో ఈ తమలపాకు ఫిష్ ఫ్రై ను తింటే ఎక్కడ దొరకని రుచి వస్తుంది. ఇంకా దీనిలో నాలుగు  ఉల్లిపాయ ముక్కలు, ఒక నిమ్మచెక్క,  ఇంకా కొద్దిగా పుదీనా చట్నీతో దీనిని సర్వ్ చేస్తే రుచి కూడా డబుల్   అవుతుంది. చేపను తమలపాకులో చుట్టి అలా 10 నిమిషాలు ఉంచి వేయిస్తే దీనిలో ఉన్న ఫ్లేవర్ ముక్కలకు పడుతుంది. ఈ రెసిపీకి కొర్రమీను చేప మంచి రుచి వస్తాయి.

Follow Us