
కావాల్సిన పదార్థాలు : 200 గ్రాములు ఎండు చేపలు, రెండు కప్పులు గోంగూర , రెండు పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 టేబుల్ స్పూన్స్ నూనె, పోపు, రుచికి సరిపడినంత ఉప్పును తీసుకోవాలి.

ముందుగా ఎండు చేపలను తీసుకుని ఉప్పు, పసుపుతో బాగా శుభ్రపరచుకోవాలి. వేడి నీటిలో 5 నిమిషాల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోండి.

స్టవ్ వెలిగించి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక గోంగూర ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా ఉడికించి రోట్లో కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే పాన్ లో ఆయిల్ వేసి పోపు గింజలు, కరివేపాకు ఆకులు, ఉల్లిపాయలు ముక్కలు , కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించాలి.

ఆ తర్వాత ముందు క్లీన్ చేసిన ఎండు చేపలను ఈ మిశ్రమంలో వేసి పది నిమిషాల పాటు అలాగే నూనెలో మగ్గనివ్వాలి. గోంగూర పచ్చి వాసన పోయాక , రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు వేసి స్టవ్ మీదే కొద్దీ సేపు ఉంచండి. చివర్లో కొత్తిమీర వేసి దించేయండి. అంతే, వేడి వేడి గోంగూర ఎండు చేపల కూర రెడీ