
కోల్డ్ థెరపీ అంటే ఏమిటి?: దీనిని క్రయోథెరపీ అని కూడా పిలుస్తారు. మనకు దెబ్బ తగిలినప్పుడు.. ఆ ప్రాంతంలో ఐస్ ప్యాక్ లేదా ఐస్ వాటర్ పెట్టడం ద్వారా అక్కడున్న రక్తనాళాలను సంకోచించి.. ఆ భాగానికి రక్త ప్రసరణను తగ్గిస్తాయి. ఇలా చేయడం వల్ల మనకు దెబ్బ తగిలిన ప్రదేశంలో వాపు రావడం, ఎర్రగా మారడం, నొప్పి, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుది. దీన్నే వైద్య పరిభాషలో కీమె తెరఫీ లేదా ఐస్ థెరఫీ అంటారు.

దీనిని ఎప్పుడు వాడాలి: మీకు ఎప్పుడైనా కొత్తగా గాయాలు తగిలినా, లేదా కండరాలు పట్టేసినా, ఆటల ఆడేప్పుడు గాయాలు అయినా, దెబ్బ తగిలిన ప్రదేశంతో వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అయినా.. గాయం తగిలిన మొదటి 24 నుండి 48 గంటలు వరకు వాడవచ్చు. ఉదాహరణకు మీ కాలు బెణికి వాపు వస్తే, ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల ఈజీగా తగ్గిపోతుంది. ఇది ఇతర మందుల కంటే స్పీడ్‌గా పనిచేస్తుంది. అలాగే ఇది చాలా సురక్షితమైనది. అయితే దీన్ని వాడేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. దీన్ని ఎప్పుడు నేరుగా పెట్టకూడదు. ఓర టవల్ లేదా గుడ్డ, కవర్‌లో ఐస్ వేసిన పెట్టుకోవాలి. దీన్ని ఒకసారి పెట్టిన తర్వాత మళ్లీ గంట వరకు గ్యాప్ తీసుకోవాలి. వెంట వెంటనే పెట్టకూడదు.

హీట్ థెరపీ అంటే ఏమిటి?: ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పిని తగ్గించడానికి హీటింగ్ ప్యాడ్‌లు, హాట్ వాటర్ బాటిళ్లు, వెచ్చని టవల్స్ లేదా హాట్ వాటర్‌తో స్నానం చేయడాన్ని హీట్ థెరపీ అంటారు. ఇలా చేయడం ద్వారా వేడి రక్త ప్రసరణను పెంచుతుంది, ఇది కండరాలు రిలాక్స్ అవ్వడానికి, బిగుసుకు పోయిన వాటిని రిలీఫ్ చేయడానికి సహాయపడుతుంది. బాగా ఎక్కవ గాయాలు ఉన్న వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది.

దీనిని ఎప్పుడు వాడాలి: దీర్ఘకాలిక లేదా పాత నొప్పులు, కండరాల బిగుసుకు పోయినప్పుడూ, లేదా మెడ, భుజం, నడుము నొప్పి, కీళ్లనొప్పులు, వ్యాయామానికి వార్మింగ్ అప్‌లా వాడోచ్చు. ఉదాహరణకు ఎటువంటి వాపు లేకుండా కొన్ని రోజులుగా నడుము నొప్పితో బాధపడుతుంటే, హీటింగ్ ప్యాడ్ వాడటం వల్ల మీరు మంచి ఉపశమనం పొందవచ్చు. ఈ పద్దతి వాడేప్పుడు ఎక్కువ వేడిగా ఉన్న హీటింగ్ ప్యాడ్‌లను వాడకండి, దీనివల్ల చర్మం కాలే ప్రమాదం ఉంది.

కోల్డ్ vs హీట్ థెరపీ: తేడా ఏమిటి? : ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే.. వాటిని ఏ సమయంలో వాడుతున్నామనేది చాలా ముఖ్యం. కొత్త గాయం వల్ల వచ్చే వాపు, ఇన్ఫ్లమేషన్, తీవ్రమైన నొప్పిని తగ్గించడానికి కోల్డ్ థెరపీ వాడడం బెటర్.. కండరాలను రిలాక్స్ చేయడానికి, రక్త ప్రసరణను పెంచడానికి, దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి హీట్ థెరపీ బాగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీ నొప్పి చాలా తీవ్రంగా ఉన్నా, తగ్గకపోయినా లేదా గాయానికి గల కారణం మీకు తెలియకపోయినా మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించండి.