ఉప్పు ఎక్కువ తీసుకుంటే ఎంత ముప్పు తెలుసా?

Samatha

19 July 2026

చాలా మంది ఉప్పు అధికంగా తీసుకుంటారు. కానీ ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఉప్పు

అతిగా ఉప్పు తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయంట. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఆరోగ్య సమస్యలు

ఉప్పు అతిగా తీసుకోవడం వలన ఇది రక్తం వాల్యూమ్ పెంచుతుంది. దీంతో రక్తప్రసరణ పెరిగి,గుండె, రక్తనాళాలపై ఒత్తిడి పెంచుతుంది. ఇది బీపీకి కారణం అవుతుంది.

బీపీ

అలాగే కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. అతిగా ఉప్పు తీసుకోవడం వలన ఇది స్ట్రోక్, గుండె వైఫల్యానికి కారణం అవుతుందని చెబుతున్నారు నిపుణులు.

కిడ్నీ సమస్యలు

అంతే కాకుండా ఉప్పు అతిగా తీసుకోవడం వలన ఇది శరీరంలో వాపును పంచుతుంది. దీని  వలన కాళ్లు, చేతులు, ముఖం ఉబ్బడం జరుగుతుందంట.

వాపు

అలాగే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన ఇది శరీరంలో ఉన్న కాల్షియం బయటకు పోయేలా చేస్తుంది. దీంతో ఎముకలు బలహీన పడిపోతాయి.

ఎముకల బలహీనత

ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు , కూరల్లో ఉప్పు అతిగా తీసుకోవడం వలన ఇది క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతుంది. క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందంట.

క్యాన్సర్

అంతే కాకుండా ఇది గ్యాస్, ఎసిడిటీ, నీరసం, చర్మ సమస్యలు వంటి అనేక ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

గ్యాస్ ఎసిడిటీ