
టేస్టీ టేస్టీ పెరుగు వడలు ఇంటిలోనే చాలా సులభంగా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఆహారపదార్థాల్లోకి వెళితే.. గడ్డ పెరుగు రెండు నుంచి మూడు కప్పులు, మినపప్పు, ఉప్పు, పచ్చి మిర్చి, అల్లం రెబ్బలు, నూనె, క్యారట్ తురుము, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండు మిర్చి.

ఇప్పుడు వడలు తయారు చేసుకోవాలి. పెరుగు వడల కోసం కప్పు మినపప్పు తీసుకోవాలి. దీనిని తయారీకి నాలుగు గంటల మందు నానబెట్టుకోవాలి. తర్వాత వీటిలో అల్లం వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి, ఉప్పు, పచ్చి మిర్చి, కొంచెం కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో వడలు వేయించుకోవడానికి సరిపడ నూనె వేయాలి. ఇప్పుడు వడలను తయారు చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం వడలు చేసుకోవాలి. వడలు మంచిగా కాలే విధంగా, బంగారు రంగు వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు పెరుగు మిశ్రమం తయారు చేసుకోవాలి. దీని కోసం పెరుగును ఒక బౌల్‌లో తీసుకోవాలి. దానిని చిక్కగా తయారు చేసుకోవాలి కొన్ని నీళ్లు పోస్తూ, తర్వాత కొంచెం నూనె పోసి అందులో ఆవాలు, ఎండు మిర్చీ కొత్తిమీర వేసి తాళింపు పెట్టుకొని ఆ తాళింపు పెరుగు మిశ్రమంలో వేయాలి. తర్వాత అందులో వడలు వేసి దాదాపు 20 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ పెరుగు వడ రెడీ.

ఈ పెరుగు వడలు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. అంతే కాకుండా వీటిని తినడం వలన ఇది డీ హైడ్రేషన్‌ను తగ్గిస్తుంది. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.