మలబద్ధకం అనేది ఒక సాధారణ సమస్య. కడుపు శుభ్రంగా లేకపోవడం వల్ల మలబద్ధకం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. మలబద్ధకం కారణంగా తలనొప్పి, వికారం, కడుపులో గ్యాస్, జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు.
తగినంత నీరు తాగాలి: రోజూ తగినంత నీరు తాగాలి. ప్రతిరోజూ 8 నుండి 10 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చగా నీటిలో నిమ్మరసం, నల్ల ఉప్పు కలిపి తాగాలి.
నిమ్మరసం: నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మరసాన్ని నీటిలో కలిపి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. మీరు ఉదయాన్నే నిమ్మరసం తాగవచ్చు. ఇది మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగించేలా పనిచేస్తుంది.
పెరుగు: పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో క్యాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది మలబద్ధకం సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.
పాలకూర: పాలకూరలో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూర, పాలకూర లాంటివి తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇలాంటి సందర్భంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారం తీసుకోవాలి.