Oily Skin: జిడ్డు చర్మానికి వంట గదిలోనే పరిష్కారం.. ఇలా చేస్తే చర్మ సమస్యలన్నీ మటుమాయం..

|

Jul 24, 2023 | 7:35 AM

Skincare Tips: చర్మ సమస్యలతో బాధపడేవారికి శనగపిండి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేసవి, వర్షాకాలంలో ఎదురయ్యే జిడ్డు చర్మానికి ఇది ఓ చక్కని పరిష్కారం. మరి జిడ్డు చర్మం నుంచి ఉపశమనం కోసం శనగపిండిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..

1 / 7
Skincar: కాలేజీ, ఆఫీస్ లేదా బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాక చర్మం జిడ్డుగా ఉండడం అనేది సర్వసాధారణమైన సమస్య. ఇది చాలా చిరాకుగా, అసౌకర్యంగా ఉన్న భావనను కలిగిస్తుంది.

2 / 7
చర్మంపై జిడ్డు ఉండడం వల్ల ముఖంపై దద్దర్లు, మొటిమలు, మచ్చలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ జిడ్డు చర్మంతో పాటు అన్ని రకాల చర్మ సమస్యలకు ఇంట్లోనే ఉండే శనగపిండితో చెక్ పెట్టవచ్చు.

3 / 7
అవును, వారానికి 2 సార్లు శనగపిండితో ఫేస్ ప్యాక్ చేస్తే చర్మ సమస్యలు తొలగిపోవడంతో పాటు చర్మం మెరిసిపోతుంది.

4 / 7
శనగపిండి ఫేస్ ప్యాక్ కోసం ఒక చెంచా ముల్తానీ మట్టి, మరో చెంచా శనగపిండితో బాగా కలపండి. శనగ పిండి చాలా మంచి క్లెన్సర్ అయినందున ఇది ముఖ చర్మం నుంచి జిడ్డును నియంత్రిస్తుంది.

5 / 7
ముల్తానీ మట్టి-శనగపిండి మిశ్రమంలో 1 స్పూన్ రోజ్ వాటర్ వేసి చాలా జిగటగా కలపాలి. దానిలో 5 చుక్కల నిమ్మరసం  జోడించండి. ఇది చర్మంపై అధిక చెమట, జిడ్డు భావనను తొలగిస్తుంది.

6 / 7
అనంతరం ఈ ఫేస్ ప్యాక్‌ని అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ప్యాక్ పొడిగా అయిపోయాక మీ ముఖాన్ని.. తడిచిన టవల్‌తో తడి చేయండి. ఇది జిగట అనుభూతిని పూర్తిగా తొలగిస్తుంది.

7 / 7
తర్వాత మీ ముఖాన్ని నీటితో బాగా కడగాలి. అయిపోయాక రెండు ఐస్ ముక్కలను తీసుకని అందులో రోజ్ వాటర్‌ని మిక్స్ చేయండి. అనంతరం కాటన్‌ని అందులో ముంచి దాంతో ముఖంపై మసాజ్ చేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే మీ ముఖంపై అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.