
High Bp

అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ఉప్పులో సోడియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కువగా తీసుకోవడం హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆహారంతో పాటు ఊరగాయ, పచ్చళ్లను తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. మీరు అధిక రక్తపోటు ఉన్న రోగి అయితే ఊరగాయలకు దూరంగా ఉండాలి.

బీపీ రోగులు మద్యం సేవించకూడదు. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని.. దీనివల్ల బీపీ పెరుగుతుందని పేర్కొంటున్నారు.

చాలా మందికి తరచుగా టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే, హై బీపీ ఉన్నవారు టీ తాగడం మానేయాలి. ఎందుకంటే ఇది తీసుకోవడం వల్ల మీ బీపీ పెరుగుతుంది.

Bp