AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaisshnav Tej: మూడేళ్లు నుంచి నో మూవీస్.. కట్ చేస్తే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ మళ్లీ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడా.? తొలి సినిమా ‘ఉప్పెన’తోనే ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో, కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ, ఒకేసారి మూడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టినట్లు టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది.

Rajeev Rayala
|

Updated on: Oct 12, 2026 | 1:43 PM

Share
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ మళ్లీ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడా.? తొలి సినిమా ‘ఉప్పెన’తోనే ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో, కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ, ఒకేసారి మూడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టినట్లు టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. వరుస పరాజయాల నుంచి బయటపడి, కెరీర్‌కు కొత్త ఊపునివ్వాలనే లక్ష్యంతో వైష్ణవ్ తేజ్ ఈసారి విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

1 / 5
2021లో విడుదలైన ‘ఉప్పెన’ సినిమాతో వైష్ణవ్ తేజ్ హీరోగా టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకథ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్‌కు ఒక్కసారిగా గుర్తింపు లభించింది. తొలి సినిమాతోనే విజయాన్ని అందుకోవడంతో ఆయనపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం అదే స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపొలం విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. అనంతరం విడుదలైన రంగ రంగ వైభవంగా, ఆదికేశవ చిత్రాలు కూడా కమర్షియల్‌గా నిరాశపరిచాయి. దీంతో వైష్ణవ్ తేజ్ తన తదుపరి సినిమాల ఎంపికపై మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

2 / 5
ఆదికేశవ విడుదల తర్వాత వైష్ణవ్ తేజ్ నుంచి కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ విరామం నేపథ్యంలో ఆయన తదుపరి ప్రాజెక్టులపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం, కథల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ కొత్త సినిమాలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈసారి కేవలం సినిమాలు చేయడమే కాకుండా, ప్రేక్షకులకు నచ్చే కథలు, బలమైన వినోదం, తనకు సరిపోయే పాత్రలతో తిరిగి విజయాల బాట పట్టాలని వైష్ణవ్ తేజ్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ముగ్గురు దర్శకులతో వేర్వేరు ప్రాజెక్టులు చర్చల్లోకి రావడం ఆసక్తికరంగా మారింది.వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్టుల్లో ఒకటి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మహేష్ సూరపనేని దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. 

3 / 5
ఇక రెండో ప్రాజెక్ట్ కోసం వైష్ణవ్ తేజ్ దర్శకుడు వీఐ ఆనంద్‌తో చేతులు కలపనున్నట్లు ప్రచారం సాగుతోంది. విభిన్నమైన కథాంశాలు, కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో సినిమాలు రూపొందించే దర్శకుడిగా వీఐ ఆనంద్‌కు గుర్తింపు ఉంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు ఖరారైతే వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో మరో విభిన్నమైన ప్రయత్నంగా నిలిచే అవకాశం ఉందట.  

4 / 5
వైష్ణవ్ తేజ్ లైనప్‌లో ఆసక్తి రేకెత్తిస్తున్న మరో ప్రాజెక్ట్ దర్శకుడు పరశురామ్ పెట్లతో ఉండనున్నట్లు తెలుస్తోంది. గీత గోవిందంతో భారీ విజయాన్ని అందుకున్న పరశురామ్, యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథలను తెరకెక్కించడంలో గుర్తింపు పొందారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైష్ణవ్ తేజ్‌కు సరిపోయే యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథను దర్శకుడు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కథపై మరింత కసరత్తు జరుగుతోందని, పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత ఇతర వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

5 / 5
Follow Us
మూడేళ్లు నుంచి నో మూవీస్.. కట్ చేస్తే
మూడేళ్లు నుంచి నో మూవీస్.. కట్ చేస్తే
విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌కు కారణం అతడే..!

దసరాకు ఇంటికెళ్లేందుకు టికెట్ దొరకడం లేదా..? ఈ రైళ్లల్లో సీట్లు..

నవరాత్రుల స్పెషల్ ప్రసాదం కొబ్బరన్నం.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..

ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది

చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు

బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది

ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!

క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!