రీనాల్ట్ ట్రైబర్: అత్యంత తక్కువ ధరకు లభించే 7 సీటర్ కారులలో రీనాల్ట్ ట్రైబర్ చెప్పుకోదగిన మొదటి కారు. ఈ కారు ధర 5.92 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో పాటు 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రోజెక్టర్ కూడా ఉంటాయి.
మారుతి సుజుకి ఎర్టిగా: దేశంలో అత్యంత ఎక్కువగా అమ్ముడవుతున్న కారులలో మారుతి సుజుకి ఎర్టిగా ప్రప్రథమ స్థానంలో ఉంది. దీని ధర 8.35 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. క్రూయిజ్ కంట్రోల్, ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
మహీంద్రా బొలేరో నియో: దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన 7 సీటర్ కార్ మోడల్‌ల్లో మహీంద్రా బొలేరో నియో కూడా ఒకటి. దీని ధర 9.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో కూడా 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 100 పీఎస్ 260 ఎన్ఎం జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఉంది.
మహీంద్రా బొలేరో: మహీంద్రా బొలేరో ఏళ్ల తరబడి ప్రజల మనస్సుల్ని దోచుకుంటున్న వాహనం. దీని ధర 9.53 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్, ఎయిర్ కండీషనింగ్ వంటి సౌకర్యాలున్నాయి.
భారతీయ మార్కెట్‌లో ఎస్‌యూవీ తరువాత 7 సీటర్ కార్లకే డిమాండ్ పెరుగుతోంది. కమర్షియల్ రూపంలో కూడా ఈ కార్లు ప్రసిద్ధి.