
శరీరానికి నూనె రాసుకోవడం వల్ల కణజాలం, అవయవాలకు రక్త ప్రవాహం, ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. దీంతో స్కిన్ హైడ్రేట్ అవుతుంది. చర్మం సాఫ్ట్‌గా మారుతుంది. కాలు, పాదం, మెడ, తలను సున్నితంగా నూనెతో మసాజ్ చేస్తే నరాలు రిలాక్స్ అవుతాయి. బాగా నిద్రపడుతుంది.

కాస్త వేడి నూనెతో శరీరాన్ని మసాజ్ చేస్తే బ్లడ్‌ఫ్లో మెరుగుపడుతుంది. కొన్ని ఆయిల్స్‌లో యాంటీ- ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ పదార్థాలు ఉంటాయి. వీటితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాస్త వేడి నూనెతో మసాజ్ చేస్తే మోకాలు, జాయింట్స్దగ్గర స్టిఫ్నెస్ తగ్గుతుంది. ఫ్లెక్సిబులిటీ పెరుగుతుంది.

నూనెతో మసాజ్ చేస్తే నాడీ వ్యవస్థ మెరుగుపడి ఒత్తిడి తగ్గుతుంది. శరీరానికి నూనె రాసుకోవడం వల్ల చర్మంలోని మురికి, మలినాలు, మృతకణాలు తొలగిపోతాయి. స్కిన్ ఆయిల్ ప్రొడక్షన్, pH లెవెల్ బ్యాలెన్స్ అవుతాయి. మొటిమలు, బ్లాక్ హెడ్స్, మచ్చలు వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.

శరీరానికి నూనె రాసుకోవడం వల్ల కండరాలు, కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తరచూ శరీరానికి నూనె మర్ధనా చేయటం వల్ల నరాలను, మనస్సును శాంతపరుస్తుంది. ప్రశాంతమైన నిద్రను ప్రేరేపిస్తుంది. పడుకునే ముందు శరీరానికి నూనె రాసుకోవడం వల్ల త్వరగా నిద్రపోతారు, రిఫ్రెష్‌గా, శక్తివంతంగా మేల్కొంటారు.

శరీరానికి నూనె రాసుకోవడం వల్ల చర్మం ముడతలు తగ్గిపోయి చర్మ దృఢత్వాన్ని పెంచుతుంది. చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. అలాగే, తరచూ తలకు నూనె పట్టిస్తే జుట్టు బాగా పెరుగుతుంది. నిగనిగలాడే జుట్టు మీ సొంతమవుతుంది. నూనె అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లతో చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.