వినాయక చవితి స్పెషల్ .. ఇంటిలోనే సులభంగా చేసుకునే 5 రకాల మోదకాలు ఇవే!

Updated on: Aug 24, 2025 | 11:58 AM

గణేష్ చతుర్థి వచ్చేస్తుంది. ఈ సంవత్సరం 2025 ఆగస్టు 27న ప్రతి ఒక్కరూ వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయకుడికి ఘనంగా పూజలు, భజనలు జరిపిస్తారు. అంతే కాకుుండా బొజ్జగణపయ్యకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తుంటారు. అయితే వినాయకుడికి మోదకాలు అంటే చాలా ఇష్టం. కాగా, ఆయనకు భక్తులు సమర్పించే ఐదు రకాల టేస్టీ మోదకాలు ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాం.

1 / 5
నువ్వుల మోదకాలు : దీనిని బెల్లం, నువ్వులతో చేస్తారు. దీని కోసం నువ్వులను, బెల్లం, యాలకులు పొడి , కొబ్బరి తురుము వీటన్నింటిని కలిపి పూరణను తయారు చేస్తారు. తర్వాత కొద్దిగా బియ్యం పిండిని తీసుకొని చిన్నపాటి రోటీలా చేస్తారు. తర్వాత వాటి మధ్యలో పూరణను నింపి మోదక్ ఆకారంలో మలుస్తారు. తర్వాత వీటిని ఆవిరిపై ఉడకబెడతారు. అంతే నువ్వుల మోదక్ రెడీ.

2 / 5
మలై మోదకాలు : వీటిని పాలు,కుంకుమ పువ్వు, పంచదార, యాలకుల పొడి, నెయ్యి, బాదం పలుకులతో రెడీ చేస్తారు. గిన్నెలో పాలు తీసుకొని అవి బాగా వేడి చేయాలి. తర్వాత అందులో నుంచి 125 ఎమ్ ఎల్ పాలను తీసుకొని అందులో  కొంచెం కుంకుమ పువ్వు  వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద మరిగే పాలు, మీగడలా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత వాటిలో ముందుగా కలిపి పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు యాడ్ చేయాలి. ఆ తర్వాత రుచికి సరిపడ చక్కెర, యాలకుల పొడి వేసి మళ్లీ  వేడి చేసుకుంటూ ఉండాలి. దీంతో అవి కోవాలా తయారు అవుతాయి. తర్వా నెయ్యి వేసి మిశ్రమం మొత్తం దగ్గరగా వచ్చే వరకు కలపాలి, అది పిండిలా తయారై చాలా దగ్గరకు వస్తుంది. అప్పుడు దానిని వేరే ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి. దీంతో దానిని మోదకాలుగా చేసుకోవాలి.

3 / 5
పోహా మోదకాలు :  ఇది కర్ణాటక స్పెషల్ మోదక్ అంటారు. దీనిని బెల్లం, నెయ్యి, పోహా, యాలకుల పొడి జీడిపప్పుతో తయారు చేస్తారు. అంతే కాకుండా దీని టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందంట. మరి మీరు కూడా ఈ రకం మోదకాలను ట్రై చేయండి.

4 / 5
ఉకడిచే మోదక్ : దీనిని మహారాష్ట్రా సాంప్రదాయ మోదక వంటకం. దీనిని బియ్యం పిండి, కొబ్బరి తురుము, బెల్లం మిశ్రమంతో తయారు చేస్తారు. దీనిని పూర్తిగా ఉడికించి తింటారు. అలాగే ఈ మొదకాలు చాలా టేస్టీగా ఉంటాయంట.

5 / 5
చాక్లెట్ మోదక్ : చాక్లెట్ మోదకం చాలా మందికి ఇష్టం. దీనిని బియ్యం పిండి, చాక్లెట్, డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు.