చాలా మంది హైట్ కి సంబంధించిన సమస్యలతో ఆందోళన చెందుతూ ఉంటారు. సాధారణంగా మనిషి ఎత్తు అనేది జీన్స్ పై ఆధార పడి ఉంటుంది. కానీ చాలా మంది ఎత్తు అవ్వాలని రక రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రయోగాలు దెబ్బతింటూ ఉంటాయి. దీని కోసం సర్జరీలు చేయించు కోవడం, మందులు వాడటం వంటి చేస్తూంటారు.
నేచురల్ గా కాకుండా.. కృత్రిమంగా హైట్ పెరగడం వల్ల భవిష్యత్తులో ఖచ్చితంగా దెబ్బ తింటారు. ఎన్నో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. మరి ఆరోగ్యంగా హైట్ ఎదగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హైట్ ఎదగాలి అనుకునే వారు ముందు ఆరోగ్యకరమైన పోషకాహారం మీద దృష్టి పెట్టాలి. పోషక విలువలు ఉన్న ఆహారంతో పాటు వ్యాయామం కూడా చాలా ముఖ్యం. ఎత్తు పెరగడానికి ఇది చాలా ఉపయోగ పడుతుంది. క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
హైట్ అవ్వాలి అనుకునే వారు తరుచుగా అరటి పండు తింటూ ఉండాలి. బనానాలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో క్యాల్షియం, పొటాషియం, ఫైబర్, మాంగనీస్ వంటివి ఉంటాయి. ఇవి పెరుగుదలకు బాగా హెల్ప్ చేస్తుంది.
పాలతో తయారు చేసిన ఉత్పత్తులు, ఆకు కూరలు తీసుకోవడం వల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిల్లో ఉండే క్యాల్షియం, విటమిన్లు.. కణాల ఎత్తు పెరగడంలో హెల్ప్ చేస్తాయి.