
ఈ ద్రోణి ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలోని కొన్ని ఉత్తర పశ్చిమ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని.. సోవమారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక మంగళవారం రాష్ట్రంలోని చాలా జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇదిలా ఉండగా తర్వాతి రోజుల్లో రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే నాలుగు, ఐదు రోజుల్లో క్రమేపి మూడు నుంచి నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.

అయితే ఈ ద్రోణి ప్రభావంతో అటు ఏపీలోనూ రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ నేపథ్యంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే వర్షం సమయంలో గంటకు 30-40 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

అయితే కోస్తా ఆంధ్రప్రదేశ, యానాంలో ఆదివారం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయని.. రాబోయే 6 రోజుల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ తగ్గే అవకాశముందని వాతవరణ శాఖ తెలిపింది. రాయలసీమలో రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో ఎలాంటి మార్పు లేదని కానీ రాబోయే 5 రోజుల్లో మాత్రం ఉష్ణోగ్రతలు క్రమంగా 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.