కార్బోహైడ్రేట్స్, క్యాలరీలతో పాటు, రైస్‌లో పీచు, ప్రొటీన్, కొవ్వు, స్టార్చ్, విటమిన్ బి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి అన్నం తినడం మానేయాల్సిన పనిలేదు. బియ్యం బదులు సరైన బియ్యం రకాన్ని ఎంచుకుంటే సమస్యను తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు. మార్కెట్‌లో రకరకాల బియ్యం దొరుకుతున్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల బియ్యం ఉన్నాయి. వాటిల్లో బ్రౌన్ రైస్ ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ్రౌన్ రైస్‌లో ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, జింక్ ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి బ్రౌన్ రైస్ తినవచ్చు.