
నేటి కాలంలో యువత ఫిట్‌గా ఉండేందుకు, శరీర బరువును అదుపులో ఉంచుకునేందుకు జిమ్‌ను ఆశ్రయిస్తున్నారు. వ్యాయామం చేయడం వల్ల చాలా కేలరీలు ఖర్చవుతాయి. ఇది శరీర బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే జిమ్‌తో పాటు పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. జిమ్‌కు వెళ్లే ముందు, అలాగే జిమ్ నుంచి వచ్చిన తర్వాత సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. శరీర అలసట నుంచి ఉపశమనం కలిగించే ఆహారాలు తప్పక తీసుకోవాలి. ఇవి శరీరాన్ని తాజాగా ఉంచుతాయి. కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..

అరటిపండులో ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తి బూస్టర్‌లుగా పనిచేస్తాయి. అరటిపండులోని చక్కెరలు, పొటాషియం కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి. వ్యాయామ సమయంలో కండరాల తిమ్మిరిని నివారిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా జిమ్‌కి వెళ్లే ముందు కనీసం ఒక అరటిపండు తినండి.

జిమ్‌కి వెళ్లే ముందు కడుపు నిండుగా ఉండడంతోపాటు శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. ఓట్స్‌లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిని పెంచడంలో సహాయపడతాయి. కాబట్టి జిమ్‌కి వెళ్లే ముందు ఓట్స్ మీల్ తప్పక తీసుకోవాలి. అలాగే ప్రోటీన్-రిచ్ ఫుడ్ ప్రొడక్ట్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది పెరుగు. ఇందులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. పెరుగు జీర్ణక్రియలో, కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి మీరు జిమ్‌కి వెళ్లే ముందు పెరుగు కూడా తినవచ్చు.

జిమ్‌కి వెళ్లే ముందు ఎనర్జీ బూస్టర్ తీసుకోవడం ఎంత ముఖ్యమో జిమ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం కూడా అంతేముఖ్యమని డైటీషియన్లు సిఫార్సు చేస్తున్నారు. కాబట్టి మీరు జిమ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత లీన్-ఫ్యాట్, ప్రోటీన్-రిచ్ చికెన్ బ్రెస్ట్ తినవచ్చు.ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి జిమ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాలకూర, బీన్స్, ఉల్లిపాయ ఆకులు వంటి కూరగాయల ముక్కలతో చేసిన సలాడ్ తీసుకోవచ్చు. అలాగే చాక్లెట్ మిల్క్ కూడా చాలా మంచి ఎంపిక. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరం గ్లైకోజెన్‌ను నిల్వ చేయడానికి, కండరాల బలాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది అథ్లెట్లు జిమ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత దీనిని తాగుతారు.

పాలకూరలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి జిమ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాలకూర, బీన్స్, ఉల్లిపాయ ఆకులు వంటి కూరగాయల ముక్కలతో చేసిన సలాడ్ తీసుకోవచ్చు. అలాగే చాక్లెట్ మిల్క్ కూడా చాలా మంచి ఎంపిక. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరం గ్లైకోజెన్‌ను నిల్వ చేయడానికి, కండరాల బలాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది అథ్లెట్లు జిమ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత దీనిని తాగుతారు.