పసుపు టీలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. పసుపు టీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి నొప్పులు, మంట, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది బాధాకరమైన ఇబ్బందులను తగ్గిస్తుంది.
టర్మరిక్ టీ అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారిస్తుంది. పసుపులో కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అల్జీమర్స్ లాంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది.
క్యాన్సర్ రాకుండా ఉండాలంటే రోజూ టర్మరిక్ టీ తీసుకోవాలి. పసుపు టీలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి.
పసుపు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీంతోపాటు పలు రకాల వైరస్‌ల నుంచి సురక్షితంగా కాపాడుతుంది. కాబట్టి పసుపును రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.