

పియర్ పండు ఎప్పుడూ తొక్కతోనే తినాలి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పియర్ తొక్కలో అధికంగా ఉంటాయి. అందువల్లనే ఈ పండ్లను తొక్క తీయకూడదు. ఆ పండ్లను తొక్కతో కలిపి తినాలి. అంతేకాకుండా వీటి తొక్కల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది.

రోజూ ఒక యాపిల్ తినమని వైద్యులు చెబుతుంటారు. ఈరోజుల్లో దీన్ని ఫ్యాషన్‌గా పిలుస్తారో లేక మరేదైనా కారనమో తెలియదు గానీ యాపిల్‌ను తొక్క ఒలిచి తింటుంటారు. ఆపిల్ తినేటప్పుడు తొక్క అస్సలు తియ్యకూడదు. యాపిల్ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి.

జామపండును కూడా తొక్కతో తినాలి. జామపండులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్స, మినరల్స్ అధికంగా ఉంటాయి. జామపండులో మాత్రమే కాకుండా దాని తొక్కలో కూడా ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయి.

ఫైబర్, ఫోలేట్, విటమిన్ ఇ వంటి కారకాలు కివీ పండు తొక్కలో ఉంటాయి. కివీ తొక్కను తీయకుండా.. తినాలి. ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.