uppula Raju |
Feb 24, 2022 | 12:24 PM
లావెండర్ ఆయిల్: యాంటిసెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉండే లావెండర్ ఆయిల్ బ్యాక్టీరియా, ఫంగస్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది బొబ్బలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కలు వేయడం వల్ల మానసిక ప్రశాంతతతోపాటు ఒత్తిడి తగ్గుతుంది.
యూకలిప్టస్ ఆయిల్: యూకలిప్టస్ ఆయిల్ ప్రభావంలో చాలా వేడిగా ఉంటుంది. జలుబు-దగ్గు, ముక్కు కారటం తగ్గిస్తుంది. మరిగే నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పడితే మూసుకున్న ముక్కు తెరుచుకుంటుంది.
పుదీనా ఆయిల్: మీకు తలనొప్పి సమస్య ఉంటే కొన్ని చుక్కల పుదీనా ఆయిల్ వేసి నుదుటిపై మసాజ్ చేయాలి. వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇది కాకుండా వాపు, కండరాల తిమ్మిరి, నొప్పి సమస్యలో కూడా దీనిని వాడుతారు.
లెమన్ ఆయిల్: లెమన్ ఆయిల్‌లో చాలా శక్తివంతమైన యాంటీ మైక్రోబియల్ ఏజెంట్ ఉంటుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. కొన్ని చుక్కలు నోట్లో వేసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకు పంపిస్తుంది. ఇది చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయడానికి, సహజ కాంతిని తీసుకురావడానికి ఉపయోగిస్తారు.
టీ ట్రీ ఆయిల్: టీ ట్రీ ఆయిల్ యాంటీ బాక్టీరియల్‌గా చెప్పవచ్చు. దురద, మొటిమలు, గాయాలు, కీటకాలు కాటు, వడదెబ్బ, మొటిమలు, గజ్జి, చుండ్రు వంటి సమస్యలలో ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది.