
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా రక్త నాళాలలో పేరుకుపోయి రక్త ప్రసరణలో సమస్య కలిగిస్తుంది. దీంతో గుండె సమస్యలు పెరుగుతాయి. అల్లం, వెల్లుల్లితో చెడు కొలస్ట్రాల్‌కు చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు..

అల్లం-వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి ప్రో-ఇన్‌ఫ్లమేటరీ ప్రోటీన్‌లను నిరోధించడంలో సహాయపడతాయి.

వెల్లుల్లిలోని కారకాలు చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధించి, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను 15 శాతం వరకు తగ్గిస్తాయి.

అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ఆహారంలో కొద్దిపాటి మర్పులు చేసుకోవడం చాలా అవసరం. ఇటువంటివారు అల్లం, వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

రోజుకు వెల్లుల్లి రెబ్బ ఒకటి, అంగుళం అల్లం తింటే రోగనిరోధక మెరుగుపడుతుంది.