
Jackfruit side effects: పనస పండు చాలా మందికి ఇష్టమైనది. అయితే, దీనిని తినడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో.. దానిని తిన్న తరువాత వేరే పదార్థాలు తింటే కలిగే అనార్థాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పనస పండును తిన్న తరువాత పొరపాటున కూడా కొన్ని పదార్థాలు తినకూడదట. అలా చేస్తే లేని అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలు తాగొద్దు: పనసపండు తిన్న వెంటనే పాలు తాగాలని కొందరు పొరబడుతుంటారు. ఇలా చేస్తే ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే.. పనసపండు తిన్న తరువాత పాలు తాగొద్దు.

తేనె తీసుకోవద్దు: పనసపండు తిన్న తరువాత తేనె ను, తేనె కలిపిన పదార్థాలను తినొద్దు. ఇది మధుమేహ బాధితుల్లో షుగర్ స్థాయిలను పెంచుతుంది.

బొప్పాయి తినొద్దు: బొప్పాయి ఆరోగ్య పరంగా చాలా మంచిది. అయితే, పనసపండు తిన్న తరువాత మాత్రం బొప్పాయిని పొరపాటున కూడా తినొద్దు. ఇలా చేస్తే.. ఉదర సంబంధిత సమస్యలు ఉత్పన్నమయ్యే ఛాన్స్ ఉంది.

ఎక్కువ నీరు తాగాలి: చాలా మంది పనసపండును ఇష్టంకొద్ది అధికంగా తినేస్తుంటారు. అలా చేయడం వలన అసిడిటీ సమస్య రావొచ్చు. ఈ సమస్య రావొద్దు అంటే నీటిని బాగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.