Health Benefits: మీల్‌ మేకర్స్‌తో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలివే.. మీ ఆహారంలో ఇవి భాగమైతే ఆ సమస్యలు దూరం..

|

Sep 09, 2023 | 4:58 PM

Health Tips: సోయా బీన్స్‌లో శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిల్లోని కొవ్వులు, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు శరీరానికి మేలు చేస్తాయి. సోయా బీన్స్‌/మీల్ మేకర్స్‌తో మాత్రమే కాక, వాటి నుంచి తయారు చేసే సోయా చంక్స్‌ తీసుకోవడం వల్ల కూడా మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చు. సోయా చంక్స్‌లో కూడా సోయా బీన్స్‌లో ఉన్న అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. ఇంతకీ సోయా చంక్స్ తీసుకోవడం వల్ల శరీరానికి ఏ విధంగా మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
మీల్ మేకర్స్‌ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. ఫలితంగా గుండె జబ్బులు, రక్తపోటు సమస్యల నుంచి శరీరాన్ని కాపాడతాయి.

2 / 5
మీల్ మేకర్స్‌లో పుష్కలంగా ఉండే ఐసోఫ్లేవోన్‌లు కూడా రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విధంగా కూడా గుండెను కాపాడతాయి.

3 / 5
మీల్ మేకర్స్‌లోని ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి, జీర్ణ సంబంధిత మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను నిరోధిస్తుంది. ఇంకా బరువు తగ్గడంలో మనకు ఎంతగానో సహాయపడుతుంది.

4 / 5
మీల్ మేకర్స్‌ జుట్టుకు చికిత్సగా కూడా పని చేస్తాయి. వీటిల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు రాలడం, జుట్టు పొడిబారడం, జుట్టు చిట్లడం, చుండ్రు సమస్యలను నివారంచడంలో ఉపయోగకరంగా ఉంటుంది.

5 / 5
అలాగే మీల్ మేకర్స్‌‌లో ఉండే కాల్షియం ఎముకలను బలోపేతం చేయడానికి, అలాగే ఇందులోని ఐరన్ రక్తహీనతను దూరం చేయడంలో ఉపయోగపడతాయి.