
సీమ చింతకాయలలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గులాబీ, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండే సీమ చింతకాయలు కాస్త తీయ్యగా, వగరుగా ఉంటాయి. కానీ, ఇందులోని పోషకాల విషయానికి వస్తే.. విటమిన్ ఎ, బి, సి, మెగ్నీషియం, ఐరన్, కాపర్, పాస్పరస్, ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా నిండివున్నాయి.

సీమ చింతకాయలు రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, ఏకాగ్రతను పెంచుతాయి. సీమ చింతకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి కఫాన్ని తగ్గిస్తుంది. గొంతు, చిగుళ్లు, నోటిపూత నివారణకు ఉపయోగపడుతుంది.

సీమ చింతకాయలు తరచూ తినడం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్తులకు కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. సీమ చింతకాయలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అకలి తగ్గుముఖం పడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. పీచు పదార్థాలు అధికంగా ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.

సీమ చింతకాయలోని గుణాలు గుండె ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో సీమ చింతకాయ మరింత మేలు చేస్తుంది. క్షయవ్యాధి నివారణకు ఈ చెట్టు వేర్లు బాగా పనిచేస్తాయి.

సీమ చింతకాయలో ఉండే గుణాలు డయేరియా సమస్యను తగ్గిస్తాయి. తరచూ సీమ చింతకాయలను తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. చర్మంపై నల్లటి మచ్చలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. తరచూ సిమ చింతకాయలను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. వీటి విత్తనాల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో వాడతారు.