
లైంగిక శక్తి: కె, ఇ విటమిన్లకు కలిగిన ఖర్బూజా ప్రత్యుత్పత్తి వ్యవస్థని బలోపేతం చేయడంతో పాటు సంతానలేమితో బాధపడేవారికి సహాయపడుతుంది. అలాగే లైంగిక శక్తిని మెరుగుపరుస్తుంది.

గుండె ఆరోగ్యం: పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున ఖర్బూజా గుండెకు కూడా మేలు చేస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తొలగించి గుండె పోటు వంటి హృదయ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో పనిచేస్తుంది

మధుమేహం: మధుమేహ వ్యాధిగ్రస్తులకు కర్బూజ ఒక వరం. శరీరంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయగల శక్తి ఉన్నందున దీన్ని డయాబెటిక్ పేషంట్స్ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

రోగనిరోధక శక్తి: పుచ్చకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిెడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇమ్యూనిటీ వల్ల అనేక సీజనల్ వ్యాధుల నుంచి శరీరానికి రక్షణ కలుగుతుంది.

కళ్ళు: కర్బూజలోని విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటిచూపును మెరుగుపరుస్తాయి. కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఖర్బూజా సహాయపడుతుంది.