మామిడి ఆకుల‌తో ఆరోగ్యం..! ఇలా వాడితే ఆ వ్యాధులన్నీ పరుగో పరుగు..!!

Updated on: Oct 05, 2025 | 7:28 PM

మామిడి సీజన్‌ అయిపోయింది. వేస‌విలో మాత్ర‌మే ల‌భించే మామిడి పండ్లు తింటే మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. అయితే మామిడి పండ్ల‌లాగే మామిడి ఆకులు కూడా అనేక పోష‌కాలు క‌లిగి ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయని, మామిడి ఆకుల‌ను పలు వ్యాధుల‌కు ఔషధంగా కూడా ఉపయోగించవచ్చునని చెబుతున్నారు. మామిడి ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6
మామిడి ఆకులు రక్తంలో షుగర్ స్థాయిలని నియంత్రించడంలో సహాయపడతాయి. ప్రత్యేకించి టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మామిడి ఆకుల నీరు మంచి ఫలితాలను ఇస్తుంది. మామిడి ఆకులు ప‌లు దంత సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. ఈ ఆకులను ఉడికించి ఆ నీటిని పుక్కిలించడంతో దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

2 / 6
మామిడి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవ‌నాయిడ్స్ శ‌రీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి. మామిడి ఆకులను తీసుకుంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు. మామిడి ఆకులను ఉడికించి ఆ వాసనను పీల్చడం వల్ల దద్దుర్లు, శ్వాసకోశ సంబంధిత సమస్యల నుంచి త‌క్ష‌ణ ఉపశమనం పొంద‌వ‌చ్చు.

3 / 6
మామిడి ఆకుల నీరు రోజూ తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వును త్వ‌ర‌గా క‌రిగించవ‌చ్చు. దీని వల్ల శ‌రీర బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. శరీరంలోని ఉండే విషపదార్థాలను తొల‌గించి రక్తాన్ని శుభ్రపరిచేందుకు మామిడి ఆకులు దివ్యౌష‌ధంలా ప‌నిచేస్తాయి.

4 / 6
మామిడి ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత సమస్యలను నివారించేందుకు సహాయపడతాయి. అజీర్తి, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌ల‌ను కూడా మామిడి ఆకుల నీరు తాగి న‌యం చేసుకోవ‌చ్చు. ఈ నీటిని తాగితే శ‌రీరంలో పీహెచ్ స్థాయిల‌ను నియంత్రించుకోవ‌చ్చు.

5 / 6
మామిడి ఆకులు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. క్యాన్సర్ వంటి వ్యాధులకు మూల కారణమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని అవి నిరోధించగలవు. మామిడి ఆకులు జుట్టు సమస్యలను కూడా తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఆకులలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి అకాల బూడిద రంగును నివారిస్తాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి కూడా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి.

6 / 6
మామిడి ఆకు నీటి తయారీ కోసం ఒక పాత్రలో రెండు గ్లాసుల నీళ్లు పోసి స్టవ్ మీద ఉంచి 2 నుండి 4 మామిడి ఆకులు వేసి బాగా మరిగించాలి. నీరు సగానికి తగ్గే వరకు మరిగించండి. తర్వాత వడకట్టి చల్లారనివ్వండి. ఆ తరువాత తేనె వేసి తీసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం ఇలా వాడుతూ ఉంటే అతి త్వరలోనే మీరు ఊహించని ఫలితాలు గమనిస్తారు.