ఫాల్సా పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా మెగ్నీషియం, పోటాషియం, సోడియం, ఫాస్ఫరస్, కాల్షియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలున్నాయి. ఫాల్సాను నిత్యం తీసుకుంటే వీటిలో ఉండే ఫెనోలిక్, యాంటోసినిన్స్ వంటి యాంటిఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్‌ను న్యూట్రల్ చేయడంతో పాటు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను నియంత్రించి హృద్రోగాలు, క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధుల బారినపడే ముప్పును తగ్గిస్తాయి.