
Aloe Vera

జ్యోతిశాస్త్రం ప్రకారం..కలబంద మొక్కతో పాటు దాని పువ్వులు కూడా అనేక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా సూచిస్తున్నారు. ఈ పువ్వులు ఆధ్యాత్మిక కోణంలో చాలా ముఖ్యమైనవి. కలబంద మొక్క నారింజ లేదా ఎరుపు పువ్వులతో వికసిస్తే అది శుభ సంకేతంగా పరిగణిస్తారు.

జ్యోతిశాస్త్రంలో కలబంద మొక్క, దాని పువ్వు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. కలబంద పువ్వులు అనుకూలమైన వాతావరణ పరిస్థితులలో మాత్రమే వికసిస్తాయి. మీ ఇంట్లో కలబంద పువ్వు వికసించాలనుకుంటే సూర్యరశ్మి సమృద్ధిగా లభించే ప్రదేశంలో దీనిని పెంచండి.

కలబంద పువ్వు సంపదను ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. దీనివల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. కుటుంబ సభ్యులలో ప్రేమ నిండివుంటుంది. కలబంద పువ్వు ఎవరి ఇంట్లో పెరుగుతుందో ఆ ఇంట్లోని వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఎందుకంటే ఈ పువ్వు సంపదను ఆకర్షించే బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఆరోగ్యంతో పాటు అందానికి మేలు చేసే అలోవెరాను చాలా మంది తమ ఇళ్లలో పెంచడానికి ఇష్టపడుతుంటారు. అంతేకాదు, కలబంద వాస్తు దోషాన్ని కూడా తొలగిస్తుందని చెబుతారు. అయితే కలబంద మొక్కను ఇంట్లో పెంచుకునే వారు ఎక్కడ పడితే అక్కడ కాకుండా సరైన దిశను తెలుసుకోవాలి. లేదంటే దుష్ప్రబావాలను కలిగిస్తుందని వాస్తు జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.